1

Breaking News

నెలరోజుల గడువు

తెలంగాణ సమస్యను తేల్చేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పెట్టిన నెలరోజుల గడువు ముగుస్తున్నప్పటికీ పరిస్థితి ఒక కొలిక్కి రాలేదు. పరిష్కారం కనుచూపుమేరలో కనిపించడంలేదు. సమస్య తేలడానికి మరికొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం నాడు పార్టీ అగ్రనాయకులతో తెలంగాణ సమస్యపై చర్చించారు. ‘సంప్రదింపులు జరుగుతున్నాయి. అవి కొనసాగుతాయి’ అని పార్టీ ప్రతినిధి రేణుకాచౌదరి చెప్పారు.‘జనవరి 28తో గడువు పూర్తవుతుంది కదా? పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుందా?’ అని అడగ్గా ఆమె ఈసమాధానమిచ్చా రు.ఇంకా తేలని వైనంహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, ఏఐసీసీ ప్రధాన కార్య దర్శులు దిగ్విజయ్‌సింగ్‌, గులాంనబీ ఆజాద్‌, కేంద్రమంత్రి వయలార్‌ రవిలతో సోనియాగాంధీ చర్చలు జరిపిన అనంతరం ఓ అగ్రనాయకుడు మాట్లాడుతూ- ‘ఇంకా నిర్ణయం తీసు కోలేదు’ అన్నారు. తెలంగాణపై నిర్ణయం ఆలస్యం కావచ్చని ఆంధ్రప్రదేశ్‌ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ గులాంనబీ ఆజాద్‌ ఇప్పటికే సూచించారు. ఈ సమస్యపై పార్టీ నాయకులతో సోనియాగాంధీ తాజాగా చర్చలు జరిపిన తర్వాత ఆజాద్‌ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదైనా గడువును ప్రకటించడంపై కూడా ఆయన స్పష్టంగా సమాధానమివ్వలేదు.‘ఒకవంక కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే గడువు ప్రకటించడం ముఖ్యమా?’ అని ఆజాద్‌ అడిగారు. ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో తీవ్ర చర్చలు జరుపుతున్న తరుణంలో ఆజాద్‌ ప్రకటన వెలువడింది. జటిలమైన ఈ సమస్య పరిష్కార మార్గాలపై కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. బోడోలాండ్‌, గూర్ఖాలాండ్‌ పద్ధతిలో వెనకబడిన తెలంగాణకు ప్రాదేశిక పాలనా వ్యవస్థను రూపొందించవచ్చని ఒకరు సలహా ఇచ్చారు. సమావేశాల్లో ఇరు వర్గాలు టిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతోందనే ఉత్కంఠ గురువారం కూడా కొనసాగింది. ఢిల్లీలో టీ, సీమాంధ్ర నాయకుల పోటాపోటీ భేటీలు జరిగాయి. కొందరు తెలంగాణ నాయకులు ఢిల్లీలోనే వుంటూ రహస్య భేటీలతో తమ వ్యూహాలను రూపొందించుకుంటున్నారు. గతంలో సీమాంధ్ర నేతలు ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో సమావేశాలునిర్వహించుకు నేవారు. ఆయన ప్రస్తుతానికి అలకపాన్పు ఎక్కడంతో ఆ సమావేశాల వేదిక ఇప్పుడు ఎంపీ వెంకటరామి రెడ్డి నివాసానికి మారింది. సీమాంధ్రకు చె ందన మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయి తెలంగాణ రాస్ట్ర ప్రకటన ఉత్పన్నమైతే ఏ విధానాన్ని అనుసరించాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అనూహ్యంగా తెలంగాణ ప్రకటన వాయిదా పడినట్లే, అదే సమస్యపునరావృతమై తే ఏమిటి దిక్కు అని మథనపడిపోతున్నారు.నెల రోజులలోగా తెలంగాణపై నిర్ణయంతీసుకుంటా మని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చే సిన ప్రకటనను కేంద్ర మంత్రి ఆజాద్‌ కొట్టిపారేయడాన్ని ఇటు సీమాంధ్ర, తెలంగాణ నాయకులు ఎలా అర్ఢం చేసుకోవాలో తెలీక బెంబేలు ఎత్తిపోతున్నారు. సాక్ష్యాత్తు కేంద్ర హోం మంత్రి వాగ్ధానం చేస్తే దానిని మేం ఆచరించాలా అంటూ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై పలువురు రాష్ర్ట కేబినెట్‌ మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. తెరమీదకు రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ బుధవారం కంటే తెలంగాణ నాయకుల హడావుడి గురువారం తక్కువగానే వుంది. గురువారం ఉదయం నుంచి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు హల్‌చల్‌ సృష్టించారు. అయితే రాయలసీమ రాష్ట్రం కావాలనే కొత్త డిమండ్‌ తెరమీదకు వచ్చింది. ఉదయం 10 గంటలకు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేతో భేటీ అయి రాష్ట్రాన్ని విభజించినా, లేక పోయినా సరే అనాదిగా రాయలసీమకు అన్యాయం జరుగుతున్నదని కనుక తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరారు. రాయలసీమ డిమాండ్‌ స్వాతంత్య్రం రావడానికంటే ముందునుంచి ఉందని స్పష్టం చేశారు. ఇంతటి అన్యాయాన్ని భరించిన సీమ ప్రజలు ఇకపై ఎవరితోనూ కలిసి ఉండే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు.తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు ఆజాద్‌ ప్రకటన తర్వాత, చేసేది ఏమీ లేదని ఢిల్లీ నుంచి నిష్ర్కమించారు. మంత్రి జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య మినహా చెప్పుకోతగ్గ నాయకులెవరూ ఢిల్లీలో కనిపించలేదు. మధ్యాహ్నం మంత్రి జానారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. తెలంగాణ పై ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయని, ఆజాద్‌ ప్రకటన సారాంశం సరిగా అర్ఢం చేసుకోవాలని జానారెడ్డి మీడియాకు సలహా ఇచ్చారు.ఇది ఇలా వుండగా కెవిపి రామచంద్రరావు సహాయంతో సాయంత్రం రాహుల్‌ గాంధీ అప్పాయింట్‌మెంటు సంపాదించిన సీమాంధ్ర నేతలు గొప్పలు చెప్పుకుంటూ ఢిల్లీకి వచ్చారు. ఆ విషయం తెలిసిన రాహుల్‌ కార్యాలయం సీమాంధ్ర నేతలతో భేటీని రద్దు చేసుకుంది.

No comments