1

Breaking News

విందుభోజనం సిద్ధం

నాగార్జున-నయనతార జంటగా దశరథ్‌ దర్శకత్వంలో కామాక్షి మూవీస్‌ నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్రీకువీరుడు’ టైటిల్‌ని నిర్ణయించారు. నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడు తూ-‘‘కథ, నాగ్‌ ఇమేజ్‌ రెండిటికీ సరితగ్గ టైటిల్‌ ఇది. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. నాగ్‌తో ‘సంతోషం’ వంటి సూపర్‌హిట్‌నిచ్చిన దశరథ్‌ ఈ చిత్రాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. చక్కని కుటుంబ కథను సినిమాగా తీసి..ప్రేక్షకాభి మానులకు విందుభోజనం సిద్ధం చేస్తున్నారు’’ అన్నారు. దశరథ్‌ మాట్లాడుతూ-‘‘అమెరికాలో పుట్టిపెరిగిన హీరో ఎన్నారైగా మొదటిసారి ఇండియా వస్తారు. అతడి అనుభవాలేమిటన్నదే కథాంశం. సంతోషం, మన్మథుడు తరహాలో కుటుం బ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఈ చిత్రంలో నాగ్‌ చాలా కొత్తగా కనిపిస్తారు. కథ ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. కెమెరా: అనిల్‌ భండారి, సంగీతం: తమన్‌, కళ: రవీందర్‌.ఎస్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌ కథనం: హరికృష్ణ, అదనపు స్క్రీన్‌ప్లే: ఎం.ఎస్‌.ఆర్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వివేక్‌, సహనిర్మాత: డి.విశ్వచందన్‌రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్‌.

No comments