‘3జి లవ్’.
నవతరం ప్రేమాయణాల్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించిన సినిమా ‘3జి లవ్’.
‘ఫిబ్రవరి 14 విడుదల’ అనేది ఉపశీర్షిక. గోవర్ధన్ క్రిష్ణ దర్శకుడు.
ప్రతాప్ కోలగట్ల నిర్మాత. 26 మంది కొత్త తారల్ని తెరకు పరిచయం
చేస్తూ..స్కే్వర్ ఇండియా స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో
నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి ప్రపం చవ్యాప్తంగా
యువత సహా అన్నివర్గాల్లోనూ విశేష స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో 13లక్షల
మంది దీనిని వీక్షించారు. యువత ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో షేర్ చేసుకోవడం
ద్వారా, మహిళలు ఎక్కువగా వీక్షించడం వల్ల ఇంతటి పాపులారిటీ వచ్చింది.
వ్యాపారపరంగానూ క్రేజు వచ్చింది. త్వరలో మరో టీజర్‌ని రిలీజ్ చేయనున్నాం’’
అన్నారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న సినిమాని రిలీజ్
చేస్తున్నామన్నారు దర్శకుడు గోవర్ధన్. ఓ చక్కని చిత్రంలో నటించడం
సంతృప్తినిచ్చిందని కథానా యిక డెబోరా ఆనందం వ్యక్తం చేశారు. రావురమేష్,
అంబటిశ్రీను తదితరులు నటించారు. కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: శేఖర్
చంద్ర, కళ: రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: క్రిష్ణకిషోర్ ఇట్ల,
డాన్స్: మధు, కథ-కథనం-దర్శకత్వం: గోవర్ధన్.
No comments