ప్రత్యేక తెలంగాణ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు కోరుకుంటున్నప్పటికీ రెండు పార్టీల మద్య
సఖ్యత మాత్రం కుదరటం లేదు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్దానానికి జరిగిన ఉపఎన్నికల సందర్భంగా ఈ రెండు పార్టీల మద్య ఏర్పడిన విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.ఒక్కమాటలో చెప్పాలంటే ఇద్దరిమద్య ఎడం పెరుగుతూనే
ఉంది.ఇవాళ జిల్లా కేంద్రంలో ఈ రెండు పార్టీల నేతలు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆసక్తిని రేపుతున్నాయి.
మహబూబ్ నగర్ అసెంబ్లీ స్దానానికి గత ఏడాది జరిగిన ఉపఎన్నికల సందర్భంగా బీజేపీ,టీఆర్ఎస్ పార్టీల
మద్య స్నేహం చెడింది.రెండు పార్టీలు పోటీ చేశాయి.బీజేపీ అభ్యర్ధి యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.ఆనాడు
జేఏసీ కూడ బీజేపీ అభ్యర్దికే తమ మద్దతు తెలిపాయి.కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ నుంచి టీఆర్ఎస్
అభ్యర్ది ఓడిపోవటం కేసీఆర్ కు కొంత ఇబ్బందిని తెచ్చిపెట్టింది.దీనికి బీజేపే కారణమనే ఉద్దేశ్యంతో ఆయన ఆపార్టీపై
సమయం వచ్చిన సందర్భంలో ప్రత్యేక్షంగానో,పరోక్షంగానో చురకలేస్తున్నారు.శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో
బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య సదస్సు జరిగింది.ఈ సదస్సులో బీజేపీ జాతీయనాయకుడు వెంకయ్యనాయుడు,రాష్ట్ర
అధ్యక్షుడు కిషన్ రెడ్డితోపాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నేతలు ఆత్మీయసదస్సును
ఏర్పాటు చేశారు.దీనికి పట్టణంలోని పుర ప్రముఖులను,డాక్టర్లు,టీచర్లు,మేధావులు,జేఏసీ నేతలు,ఉద్యోగులను ఆహ్వానించారు.వారితో వెంకయ్యనాయుడు రాష్ట్ర,దేశ రాజకీయాలపై మాట్లాడారు.ప్రత్యేకంగా తెలంగాణ అంశంపై పార్టీ
వైఖరిని స్పష్టం చేశారు.అనంతరం జరిగిన చైతన్య సదస్సుకు కూడ జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా తరలి
వచ్చారు.ఆ సదస్సులో వెంకయ్యనాయుడి ప్రసంగం పార్టీ కార్యకర్తలకు ఊపునిచ్చింది.మొత్తంగా భవిష్యత్ మరోసారి
మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్దని గెలిపించుకోవాలనే దిశగా ఆపార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.మరోవైపు
మహబూబ్ నగర్ పార్లమెంట్ స్దానం నుంచి నాగం జనార్దన్ రెడ్డ పోటీ చేస్తారనే ప్రచారం కూడ జోరుగా సాగుతున్న తరుణంలో ఈపార్టీ నిర్వహించిన ప్రజా చైతన్య సదస్సుకు ప్రాధాన్యత సందరించుకుంది.ఇదిలా ఉంటే ఇవాళ కేసీఆర్ కూడ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ పర్యటించారు.ఆయన పర్యటనపై జోరుగా ప్రచారం సాగుతుంది.తన పార్లమెంట్
పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను చర్చించేందుకు జిల్లా కలెక్టర్ తో చర్చించేందుకు కేసీఆర్ వచ్చారు.క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.ఇంతవరకు బాగానే ఉన్నా
బీజేపీ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సదస్సు సమయంలో ఆయన పర్యటించటంపై వేర్వేరుగా చర్చించుకుంటున్నారు.
బీజేపీ నిర్వహించే సదస్సు ప్రాధాన్యతను తగ్గించాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఆకస్మికంగా తన పర్యటనను ఖరారు చేశారని
ప్రచారం సాగుతుంది.మీడియా కూడ కేసీఆర్ పర్యటనపైనే ఫోకస్ చేస్తారని దీంతో బీజేపీ సదస్సు నామామాత్రంగా
సాగుతుందనే ఉద్దేశ్యంతో ఇలా పర్యటన పెట్టుకుని ఉంటారని భావిస్తున్నారు.అయితే ఇటు బీజేపీ,అటు టీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణ కోసం పనిచేస్తున్నాయని చెబుతున్నా ఎవరంతకు వారు బేషజాలకు పోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని జేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పోటీపోటీగా రెండు
పార్టీల అగ్రనేతలు పర్యటించటం ప్రాధాన్యత సంతరించుకుంది.
No comments