1

Breaking News

దర్శకరత్న దాసరి

దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకునిగా మార్చి 23 నాటికి నలభై సంవత్సరాలు పూర్తి చేసుకోబో తున్నారు. దర్శకుడిగా ఆయన మొదటి చిత్రం ‘తాత- మనవడు’ 1974 మార్చి 23న విడుదయింది. ఆయనను దర్శకుడిగా పరిచయం చేసింది ప్రతాప్‌ ఆర్ట్‌‌స అధినేత కె. రాఘవ. అప్పటినుంచీ నిన్నటి ‘పరమవీరచక్ర’ దాకా సరిగ్గా 150 చిత్రాల్ని ఆయన రూపొందించారు. ఇక నిర్మాతగా మారి తారకప్రభు ఫిలిమ్స్‌ సంస్థను స్థాపించిన ఆయన సుజాత, శివరంజని, మేఘసందేశం, కంటే కూతుర్నే కను, మజ్ఞు, ఒసేయ్‌ రాములమ్మా, మామ-అల్లుడు వంటి 53 చక్కని చిత్రాల్ని అందించారు. దర్శకుడిగా మారి నలభై వసంతాలవుతున్న సందర్భంగా వచ్చే మార్చి 23న తన 151వ చిత్రాన్ని ప్రారంభించ బోతున్నారు దాసరి.

No comments