1

Breaking News

లోకేశ్‌కు బాగా ఆసక్తి ఉన్నట్లుంది ?

రాజకీయాల్లో ఎంత సక్సెసయ్యారో కానీ, భర్తగా మాత్రం పూర్తిగా విఫలమయ్యారు! నేను రాజకీయాల్లో ఉండడం వల్ల మొదట నష్టపోయింది మా ఆవిడే. నేనొక లక్ష్యం కోసం వెళ్తున్నానని ఆమె అర్థం చేసుకుంది.

మధ్యమధ్యలో ఆమె వస్తున్నారు. ఇవన్నీ చూసి బాధపడ్డారా?

చాలాసార్లు బాధపడడం జరిగింది. లక్ష్యం కోసం పనిచేస్తున్నందున కాదని చెప్పలేకపోయింది.

మీ కోడలు బ్రాహ్మణి కూడా వచ్చింది కదా. ఆమె ఏమంటోంది ?

మాది చిన్న కుటుంబం. బయట చూస్తే పెద్ద కుటుంబం. కొడుకు లోకేశ్ బాగా చదువుకున్నాడు. అందులో నా భార్య పాత్రే ఎక్కువ. ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయంలో చదివాడు. కోడలు కూడా బాగా చదువుకుంది. కెరీర్ ఓరియెంటెడ్. రాజకీయాలపై ఆధారపడవద్దనేది నా ఉద్దేశం.

మహిళలు కూడా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని మీ పార్టీ వాళ్లు అనుకుంటున్నారు కదా. అటువంటి ఆలోచన ఉందా ?
నా భార్యకు రాజకీయాలంటే అనాసక్తి. కోడలు ఎంబీఏ చేసింది. రాజకీయాల్లోకి వచ్చి కష్టపడాలన్న ఆలోచన లేదు.

లోకేశ్‌కు బాగా ఆసక్తి ఉన్నట్లుంది ?
రాజకీయాల్లోకి రావాలంటే సేవాభావంతో, నిస్వార్థంగా రావాలని లోకేశ్‌కు చెప్పాను.

రాజకీయాల్లో మీ తప్పొప్పులను లోకేశ్ ఎత్తి చూపేందుకు అవకాశం ఇస్తున్నారా?
మొన్నటివరకు అతనికి రాజకీయాలు తెలియవు కదా. నాకు ఏం చెప్పగలుగుతాడు. అయితే చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం. నగదు బదిలీ ఆలోచన అతనిదే. మంచి చేయాలనుకున్నప్పుడు ఎవరు చెప్పినా వింటాను.

No comments