ఆయుర్వేదంతో స‘ఫలం’
అనాదిగా ఆయుర్వేదంతో 
అసాధ్యమైదికూడా సాధ్యం చేసి చూపించారు మన మహర్షులు. అతి ప్రాచీన వైద్య 
విధానం నిజానికి ఆయుర్వేదమే. అందుకే ఇది ఈనాటికీ విదేశీ యుల్ని కూడా 
ఆకర్షిస్తోంది. ఇందులో అన్ని సమస్యలకీ అవసరమైన చికిత్సలున్నాయి. అందులో 
మరింత ముఖ్యమైనదీ, మహిళలకు కావలసినదీ, సంతాన సాఫల్యత.ఈ
 భూమిలో ఒక్క మగువకే భగవంతుడు ప్రసాదించిన వరం మాతృత్వం. ఈ మాతృత్వం కాస్త 
ఆలస్యమైతే దానిని పొందేందుకు చాలామంది మహిళలు పలు విధాలుగా ప్రయత్నాలు 
చేస్తుంటారు. అయితే ఆయుర్వే దంలో కొన్ని సూచనలను పాటిస్తే సంతానవతులవుతారని
 చెపుతున్నారు. నాగ కేశరముల చూర్ణాన్ని ఆవు నేతితో కలుపుకుని నెలసరి అయిన 
నాల్గవ రోజు నుండి వారం రోజులు తీసుకోవాలి. ఆవుపాలు తీసుకుంటూ భర్తతో 
అనుకూలంగా కలిస్తే సంతానం కలుగుతుంది.పిప్పళ్లు, శొంఠి, మిరియాలు, నాగ 
కేశరములు సమ భాగాలుగా కలిపి చూర్ణించి, పావు తులం పొడిని ఒక చెంచా 
ఆవునెయ్యితో కలిపి తీసుకుంటే గర్భధారణకు అనుకూలంగా మారుతుంది.
గర్భం
 రావాలని కోరుకునే మహిళలు ఎక్కువ తీపి తినకూడదు. మినుములతో చేసిన గారెలను 
టిఫిన్‌గా తినడం మంచిది. పుష్యమీ నక్షత్రం ఉన్న రోజున శుచింగా ఉండి మర్రి 
ఊడల చివరలు తెచ్చి, నీటితో నూరి ఉదయం, సాయంత్రం రెండు చెంచాలు తీసుకుంటే...
 ముఖ్యంగా బహిష్టు నాలుగు రోజులు తీసుకుంటే అన్ని రోగాలు తగ్గి, సంతానవతులు
 కాగలుగుతారు.
 
No comments