విగ్రహాల ఏర్పాటును నిరోధిస్తూ
బహిరంగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటును నిరోధిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు
ఆదేశిం చింది. కేంద్ర పాలిత ప్రాంతాలకు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ
ఆదేశాలు వర్తిస్తాయి. తిరువనంతపురంలోని జాతీయ రహదారిపై ఉన్న నెయ్యతింకర
జంక్షన్‌లో దివంగత కాంగ్రెస్ నేత ఎన్. సుందరం నాడార్ విగ్రహం ఏర్పాటుకు
కేరళ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో దీనిని నిరసిస్తూ ఒక పిటీషన్
దాఖలైంది. విగ్రహాలు నిబెట్టడం లేదా ఏర్పాటు చేయడం వలన ట్రాఫిక్‌కు అంతరాయం
కల్గుతుందన్నది. ఎటువంటి అంతరాయం కల్గకుండా తిరిగే హక్కు ప్రజలకు ఉందని
దానికి భంగం కల్గించకూడదని సుప్రీంకోర్టు పే ర్కొంది. ‘ప్రజాభీష్టం
అతిముఖ్యమైంది. రహదారులు ఎవరి సొత్తు కాదు. రో డ్లపై ప్రయాణించేటప్పుడు
వారికి ఇబ్బంది కలుగకూడదు. రహదారులపై విగ్రహాలు, ఆలయాలు, మసీదులే, చర్చిలు
మొదలైన నిర్మాణాలు చేయడం వల్ల ప్రజల హక్కును హరించినట్లవుతుంది’ అని
న్యాయమూర్తుల బెంచ్ పేర్కొంది.
No comments