షిండే చెప్పినంత మాత్రనా...
తెలంగాణ సమస్య పరిష్కారానికి తుది గడువు అంటూ ఏదీ లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం నబీఆజాద్ పేర్కొన్నారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అంశం సున్నితమైందని ఆయన వెల్లడించారు. తెలంగాణపై చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. 28వ తేదీన తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని షిండే చెప్పినంత మాత్రనా ఈనెల 28వ తేదీలోగా నిర్ణయం వెల్లడించలేమని ఆయన తెలిపారు. నెలలోనే నిర్ణయం చెప్పాలనడం సరికాదన్నారు. సాధ్యమైనంత మేరకు త్వరలోనే తెలంగాణపై ప్రకటన వస్తుందని ఆయన పేర్కొన్నారు.
No comments