ప్రజలను రెచ్చగొట్టే విధంగా...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నది రాజ్యసభ సభ్యుడు కేవీపీ 
రామచంద్రరావేనని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు  మధుయాస్కీ అన్నారు. ఈ 
సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ   తాము సామాజిక తెలంగాణ 
కోరుకుంటున్నామని, తెలంగాణ దిశగా ప్రయత్నాలు సాగుతున్న తెలంగాణ ప్రజలను 
రెచ్చగొట్టే విధంగా  సీమాంధ్ర నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు.  ఇప్పుడు 
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని తెలిసి మరోసారి ఆయన తెర వెనుక 
పావులు కదుపుతున్నాడని మండిపడ్డారు.
 
 

No comments