1

Breaking News

పది నిమిషాలు కష్టపడితే చాలు 600 నుండి 700 వరకు లాభం.



పది నిమిషాలు కష్టపడితే చాలు క్వింటాకు 600 నుండి 700 వరకు లాభం.....చేసేదల్లా రైతులు మార్కెట్ కు  తీసుకొచ్చిన పత్తి ని ఉదయం కొనుగోలు చేసి అదే పత్తిని సీసీఐ కి సాయంత్రం విక్రయిచండమే ....ఈపని చేయడానికి ఒక వ్యవస్థ సిద్దంగా ఉంటుంది అదే కమీషన్ వ్యవస్థ అలియాస్ దళారి వ్యవస్థ.....రైతుకు గిట్టుబాటు ధర దేవుడెరగు కాని వీరికి మాత్రం సీసీఐ పక్కా గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది....చెమటపట్టకుండా  అతి స్వల్ప కాలంలో  కోట్లు సంపాదిస్తారు కమీషన్ ఏజెంట్లు ...వీరికి అందరి సహకారం అన్ని విదాలా ఉంటుంది...రైతుకు రావాల్సిన గిట్టుబాటు దరకు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి   గండి కొడుతూ ఖమ్మం మార్కెట్లో సాగిస్తున్న జీరో దందా పై  ఫోకస్....


భూమి తల్లిని నమ్ముకున్న రైతన్నపై  ప్రకృతి కన్నెర్ర చేస్తే ...ఆ నష్టం నుండి బయటపడడానికి , బయటపడేయడానికి అన్ని విదాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటే ...రైతన్నకు ఆత్మహత్యలు తప్ప మరేదారి లేదు....ప్రస్తుతం ఖమ్మం మార్కెట్ కు సరుకు తీసుకొచ్చిన రైతన్న ఆవేదన ఇది....అసలే ఈ ఏడు నీలం తుఫాన్ దాటికి దెబ్బతిని ..మిగిలి న పంటనైనా గిట్టుబాటు ధరకు అమ్ముకుని అప్పులు తీర్చుకందామనే ఆలోచనతో మార్కెట్ కు వస్తున్న రైతన్న నిరాశే మిగులుతుంది......ప్రభుత్వ నిబందనల ప్రకారం కల్పించిన గిట్టుబాటు ధర తనకు అందకుండా పోతుంది....రైతు పత్తికి అడ్డమైన వంకలు పెట్టి అందిన కాడికి కొంటున్నారు...ఇదేమని ప్రశ్నిస్తే తేమ శాతం ఎక్కువగా ఉందంటున్నారు  కమీషన్ ఏజెంట్లు..... తేమ శాతాన్ని కొలిచి కొనుగోలు చేయాల్సిన సీసీఐ కూడా కమీషన్ వారితో కుమ్మక్కై  ప్రవర్తిస్తుంది....వీరు కేవలం చేతితో పట్టుకుని తేమ శాతాన్ని చూసి రైతులను నిలువునా ముంచుతున్నారు..



ప్రభుత్వ నిబందనల ప్రకారం సీసీఐ రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి వారి వద్ద ఉన్న పహాణి నకలు జీరాక్స్ తీసుకుంటుంది...దానిని రికార్డు చేసి  పై అదికారులకు పంపచాలి...అయితే ఖమ్మం మార్కెట్ లో పహాణి నకలు తీసుకుంటున్నారు పై అదికారులకు పంపిస్తున్నారు..కాని రైతుల వద్ద నుండి కమీషన్ దారులు కొనుగోలు చేసి వారి వద్ద ఒకే పాసు పుస్తకం పహాణి నకలు పై 75 క్వింటాల పత్తిని కొనుగోలు చేసినట్టు సీసీఐ రికార్డుల్లో నమోదు చేస్తున్నారు......అంటే ఒక ఎకరంలో 75 క్వింటాల్ల పత్తి దిగుబడి వచ్చి ఆ రైతు మార్కెట్లో కొనుగోలు చేసినట్టు రైతులకు చూపిస్తూ ...ఆ సరుకు పై ప్రబుత్వానికి రావాల్సిన ఆదాయానికి బారీగా గండికొడుతున్నారు....అంతే కాదు కమీషన్ ఏజెంట్లు సీసీఐ కి కొనుగోలు చేస్తే నెలరోజులవరకు డబ్బులు రావనే ప్రచారం చేస్తూ....రైతులను ఆకర్షిస్తున్నారు....సీసీఐ లో ఉన్న కొంత మంది అదికారులతో కుమ్మక్కై ఈ తతంగమంతా జరుపుతున్నారు....రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ జీరో బిజినెస్ చేస్తున్నారు....ప్రతి సంవత్సరం ఈ దందా నడుస్తున్నా అదికారుల పర్యవేక్షణ తూతూ మంత్రంగా సాగుతుంది...మీడియాలో కథనాలు వచ్చినపుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు తప్ప ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో చర్యలు తీసుకోవడం లేదు...



ఈ దందా ఇలా కొనసాగుతుంటే ... కనీసం ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటలు ధరను  కూడా ఇవ్వట్లేదని రైతులు వాపోతున్నారు....తూకే విషయం దగ్గరనుండి తేమ చూసే వరకు సీసీఐ కాని అదికారులు కాని కమీషన్ ఏజెంట్లకు మద్దతుగా నే చేస్తున్నారు తప్పితే రైతుకు మేలు చేసేలా పనిచేయడం లేదని....పత్తి ఒకే సారి వచ్చినపుడు జెండా పాట పాడి కొంత సరుకును మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మిగతా సరుకు కమీషన్ ఏజెంట్లకు అమ్మకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు చెపుతున్నారు.....ఒ పక్క పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తరుముతుంటే  కమీషన్ ఏజెంట్లకు ఎంతకో ఒకంతకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ...రైతుగా బ్రతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మేలని రైతులు తమ బాదను వెల్లడిస్తున్నారు...



మార్కెట్ అదికారులు , సీసీఐ అదికారులు , కమీసన్ ఏజెంట్లు అందరు కలిసి రైతును మోసం చేస్తూ  రైతు తీసుకొచ్చిన సరుకును అందిన కాడికి దండుకుంటున్నారు.....ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పండించిన పంటను మార్కెట్ కు తీసుకొచ్చిన రైతులు.....తిరిగి తీసుకెల్లడానికి ఇష్టపడడు..దానని ఆసరాగా చేసుకుని గిట్టుబాటు ధర కంటే తక్కువగా కల్పిస్తున్నారని...సీసీఐ కఛ్చితంగా వ్యవహరిస్తే మేమెందుకు  కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తామంటున్నారు...అయితే సీసీఐ సరుకు కొనుగోలు చేయాలంటే పహాణి నకలు అడుగుతున్నారని ,, కౌలకు తీసుకొని పండించుకున్న మాకు పహాణి నకలు ఎవరు ఇస్తారని..అందుకే కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించక తప్పడం లేదని వాపోతున్నారు..


అయితే మార్కెట్ అదికారులు కాని , సీసీఐ వారు కాని రైతులకు నష్టం కలిగించేలా  చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని , అవసరమైతే  క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని చెపుతున్నారు  మార్కెట్ కమిటీ చైర్మన్...



ఆరు కాలం శ్రమించి పంటను పండించడం  ఒక ఎత్తైతే...దానిని మార్కెట్లో గిట్టుబాటు ధరకు విక్రయించడం మరో ఎత్తుగా మారుతుంది....మార్కెట్ అంటేనే రైతులు భయ బ్రాంతులకు గురవుతున్నారు....ఏడాది పొడవున కష్టపడి పండించిన సరుకును అప్పనంగా దళారుల చేతిలో పోయాల్సి వస్తుంది...కాని పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి...ప్రభుత్వం ఎపుడైతే ఈ దళారి వ్యవస్థను శాశ్వతంగా నిర్మూలించి నేరుగా రైతుల వద్దకే వెళ్లి సరుకును బట్టి ధరను నిర్ణయించి విక్రయించినపుడే రైతుకు నిజమైన గిట్టుబాటు ధర దొరకుతుంద....కాని ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే మాత్రం రైతులు ప్రతి ఏటా మోసానికి గురవుతూనే ఉంటారు....

No comments